Hit 3 Glimpse:
న్యాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం భారీ విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఎస్. జే. సూర్య కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక అప్‌డేట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ అప్‌డేట్ హిట్ 3 సినిమా గురించి. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితమే దర్శకుడు శైలేష్ కొలను ప్రకటించారు. హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడో భాగం, ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు హంటర్స్ కమాండ్ అంటూ విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. నానిని మళ్లీ ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు.
హిట్ 3 వచ్చే ఏడాది మే 1న భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. మిక్కీ జే. మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
HIT 3లో నాని నటన, ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని నాని ని చూడడం కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.