ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లు కూడా విడాకులు తీసుకున్న నేపథ్యంలో మరో జంట కూడా విడాకులు తీసుకుంటున్నారు అంటూ.. వార్త వినిపిస్తున్నాయి. చాలా మంది ఇది నిజమే అని భావిస్తున్నారు. టాలీవుడ్ గాయని గీతామాధురి, సినీ నటుడు నందూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ప్రచారం జరుగుతోంది.
మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతున్నారని టాక్. దీనికి తోడు ఈ వార్తలపై ఇద్దరూ స్పందించకపోవడంతో… ఇది నిజం కావచ్చనే భావనలో ఉన్నారు. తాజాగా ఈ వార్తలపై నందూ స్పందించాడు. ‘మాన్షన్ 24’ సినీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందూ మాట్లాడుతూ… ఈ వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని తెలిపాడు.
ఇలాంటి వార్తలను తాము పట్టించుకోబోమని అన్నారు. ఎవరో ఏదో రాసినంత మాత్రాన తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇప్పుడు స్పందించానని తెలిపాడు. నందూ క్లారిఫికేషన్ తోనైనా ఈ పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.