సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్నీ తెలియజేయాలనుకున్నాను’ అని ట్వీట్ చేసింది నందిత. పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
నందిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది. 2016 లో హారర్ కామెడీ చిత్రం “ఎక్కడికి పోతావు చిన్నవాడ” సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
This is to inform all my wellwishers that My father Mr.shivaswamy aged 54 passed away today. May his soul rest in peace
— Nanditaswetha (@Nanditasweta) September 19, 2021