‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన సంస్థ స్వప్నసినిమా సంస్థ ఆసక్తికరమైన సినిమాలను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. దీంతో పాటు ఈ బ్యానర్‌లో మరో సినిమా రూపొందనుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రియాంక దత్, స్వప్న దత్‌లు భావిస్తున్నారు.
ఈ ఏడాది ‘ఓ బేబీ’ చిత్రంతో నందినీ రెడ్డి సూపర్ డూపర్ హిట్‌ను సాధించింది. ఇప్పుడు ఈమె ప్రియాంక దత్ నిర్మాణంలో కాంటెంపరరీ లవ్‌స్టోరీని తెరకెక్కించనున్నారు. ‘మహానటి’, ‘ఓ బేబీ’ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె.మేయర్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహించనున్నారు. లక్ష్మీ భూపాల్ రచయితగా పనిచేస్తున్నారు. జయశ్రీ ఆర్ట్ వర్క్‌ను అందిస్తుండగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది.