ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. నందిగం సురేష్. ఈయన ఓ సాధారణ ఫోటో గ్రాఫర్. కేవలం అదృష్టం కలిసొచ్చి ఏకంగా ఎంపీ అయిపోయిన వారిలో బాపట్ల ఎంపీ ‘నందిగం సురేష్’ మొదటి ప్లేస్ లో ఉంటారు. ఏ ముహుర్తాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంట్లో పడ్డారో కానీ, ఆయనకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఇంతకీ ప్రజల్లో నందిగం సురేష్ పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో నందిగం సురేష్ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, నందిగం సురేష్ కి మళ్లీ గెలిచే సత్తా ఉందా ?, అసలు నందిగం సురేష్ నేపథ్యం ఏమిటి ? చూద్దాం రండి.
నందిగం సురేష్ ఉమ్మడి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో దళిత క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సురేష్ తుళ్ళూరు హై స్కూల్ లో 10 వ తరగతి వరకు చదువుకున్నారు. సురేష్ రాజకీయాల్లోకి రాకముందు విజయవాడలో ఫోటో గ్రాఫర్ గా పనిచేశారు. నందిగం సురేష్ రాజకీయ ప్రవేశం కూడా చాలా ఆశ్చర్య కరమైన రీతిలో జరిగింది. 2014 ఎన్నికల సమయంలో పలువురు వైసీపీ నేతలకు ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలోనే జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జగన్ చెప్పిన కొన్ని ఘనకార్యాలు చేశారని టాక్ ఉంది.
నందిగం సురేష్ కేవలం ఆ ఘనకార్యాలు చేయడంతోనే 2019 ఎన్నికల్లో ఏకంగా బాపట్ల లోక్ సభకు పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారట. ఎలాగూ అదృష్టం ఉంది కాబట్టి.. ఆ ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా సురేష్ విజయం సాధించడం జరిగింది. ఐతే, ఎంపీగా ఎన్నికైన నాటి నుండి సురేష్ పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. పైగా తన నియోజకవర్గ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యే లలో గొడవలు పడ్డాడు. ఇక ప్రజలు ఈ ఎంపీగా గారిని కలవాలంటే తాడికొండ లేదా విజయవాడ వెళ్ళాల్సిందే.
నందిగం సురేష్ కి ఎన్ని వివాదాలు ఎదురైనా ఈ వైసీపీ ఎంపీ తీరు మాత్రం మారట్లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని మూడేళ్లలో ఈ వైసీపీ ఎంపీ చేయని అరాచకం లేదు. ఇక్కడ ఓ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నందిగం సురేష్ కి సొంత పార్టీ నేతల దగ్గర కూడా దందాలు చేసిన చరిత్ర ఉంది. ఇక ఆయన అనుచరుల దుందుడుకు వ్యవహార శైలి కారణంగా ఇప్పటికే ఎన్నో కేసులు పడ్డాయి.
అన్నట్టు వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నందిగం సురేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా వైసీపీ అధినేత అనుమతి పొందడానికి ఆయన తనదైన శైలిలో కసరత్తులు చేస్తునట్టు తెలుస్తోంది. ఐతే, మొత్తంగా నందిగం సురేష్ గ్రాఫ్ విషయానికి వస్తే.. ఆయన గ్రాఫ్ డిజాస్టర్ దిశగా ఎప్పుడో వెళ్లిపోయింది. అసలు ఒక ఎంపీ ఏం చేయగలడు ?, అసలేం చేస్తాడు ?, తనను గెలిపించిన ప్రజలకు తనేం చేయగలడు ? లాంటి విషయాల్లో నందిగం సురేష్ కనీస అవగాహన లేదు. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో నందిగం సురేష్ ఎట్టిపరిస్థితిలో గెలవడు. అందుకే, జగన్ రెడ్డి ఈ సారి నందిగం సురేష్ కి టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.