నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై క్లారిటీ మాత్రం లేదు. అయితే దీనికి సంబంధించి తాజాగా మరో వార్త నడుస్తోంది. అయితే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలన్న విషయంలో బాలయ్య పట్టుదలతో ఉన్నాడట. అందుకని ట్రైనర్లను పెట్టి మరి మోక్షజ్ఞ లుక్స్ కోసం పెట్టించాడట. అంతేకాకుండా అతడి నటన కోసం ప్రత్యేకంగా నిపుణులను కూడా తెప్పించారు. మోక్షజ్ఞను డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాంచ్ చేయనున్నాడట. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజముందనేది చూడాలి.