హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ సినిమా విడుదల తేదీను అఫీషయల్ గా కన్ఫర్మ్ చేశారు. జనవరి 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా ఇది. జనవరిలో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ నందమూరి హీరో దైర్యం చేసాడని చెప్పాలి.
మెహ్రీన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయాలనీ యూనిట్ చూస్తోంది. రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు కాబట్టి సినిమాను ఎంత ఎక్కువగా ప్రమోషన్ చేసుకుంటే అంత మంచిది అనుకుంటున్నారు. జనవరి 9 న రజినీకాంత్ దర్బార్, జనవరి 11న సరిలేరు నీకెవ్వరూ, జనవరి 12 న అల వైకుంఠపురంలో సినిమాలు విడుదల కాబోతున్నాయి.