HomeTelugu TrendingNandamuri Hero Movies: 2024 నందమూరి నామ సంవత్సరం అంటున్న ఫ్యాన్స్

Nandamuri Hero Movies: 2024 నందమూరి నామ సంవత్సరం అంటున్న ఫ్యాన్స్

Nandamuri Hero Movies in 2024
Nandamuri Hero Movies in 2024

Nandamuri Hero Movies:

2024 మొదలయ్యి ఆరు నెలలు గడిచిపోయింది. కానీ తాజాగా ఇప్పుడు నందమూరి అభిమానులు అందరూ 2024 ని నందమూరి నామ సంవత్సరం అని పిలుస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. నందమూరి హీరోలు అందరూ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

అన్నిటికంటే ముఖ్యంగా నందమూరి మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఒక సినిమా చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను నందమూరి అభిమానులకి ఇది ఒక పెద్ద శుభవార్త.

నందమూరి బాలకృష్ణ కూడా బాబీ దర్శకత్వంలో NBK109 సినిమాతో బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమా వాయిదా పడితే బాలకృష్ణ సినిమా డిసెంబర్ 24 విడుదలకు సిద్ధమవుతుంది.

ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దేవర సినిమాతో బిజీ గా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతోంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు టీజర్లు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకున్నాయి. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

Nandamuri Hero Movies:

ఇటు కళ్యాణ్ రామ్ కూడా హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాని కళ్యాణ్ రామ్ స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతకపై నిర్మిస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్ హీరోగా NKR21 కూడా సిద్ధమవుతోంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా కూడా ఈ ఏడాది నవంబర్ లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నందమూరి హీరోలు అందరూ వరుసగా సినిమాలతో రాబోతున్నారు. అయితే ఈ ఈ సినిమాలన్నీ నిజంగానే అనుకున్న సమయానికి విడుదల అవుతాయో లేదో చూడాలి. దేవర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది కానీ బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సినిమాల విడుదల తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu