సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు తన 28వ సినిమా.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. దాంతో సహజంగానే మూవీపై అంచనాలు ఈ ఉన్నాయి. ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వినికిడి. ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడం వలన, ఆ రోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించినున్నట్లు తెలుస్తుంది. మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఈ సినిమాలో విలన్ గా తారకరత్న పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంత అనే సందేహం అందరిలోనూ ఉంది. ఆ సందేహాలకు తెర దించుతూ తారకరత్న తాను మహేశ్ 28వ సినిమాలో చేయనున్నట్టు ఒక ట్వీట్ చేశాడు. విలనిజానికి సంబంధించిన ఒక ఎమోజీని జోడించాడు. గతంలో విలన్ పాత్రలు చేసిన అనుభవం తారకరత్నకు ఉంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్రను ఎలా డిజైన్ చేశారనేది చూడాలి.