Nandamuri Balakrishna: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా మే 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య తన కొడకు మోక్షాజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కుమారుడు నందమూరి మోక్షాజ్ఞ తెరంగేట్రం త్వరలోనే ఉండనుందని బాలయ్య క్లూ ఇచ్చారు.’మా అబ్బాయి మోక్షు కూడా రేపు ఇండస్ట్రీకి రావాలి. కానీ, నన్ను కాకుండా విశ్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని తనకు చెబుతాను. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూ ఉండాలి. నాన్న నుంచి అదే నేర్చుకున్నా. మోక్షు కూడా అదే అనుసరిస్తాడు’ అని బాలయ్య అన్నారు.
నిర్మాత వంశీతో మరో మంచి కలయిక ఉంది. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నాం.. అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. మొత్తమ్మీద ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా మొదలు కానుంది. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ కూడా తన ఫిజిక్ పై కఠినంగా వర్కౌట్స్ చేస్తున్నాడు.రీసెంట్ గా వైరల్ అయిన పిక్ లో కూడా మోక్షజ్ఞ చాలా ఫిట్‌గా మారిపోయి కనిపించాడు.
‘ఇండస్ట్రీలో కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటాను. అందులో విశ్వక్ ఒకడు. మంచి నటుడు, నాలాగే ఉడుకురక్తం. ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తాడు. నాకు విశ్వక్ సోదరుడితో సమానం. మమ్మల్ని కవలలు అంటారు. తనకు సినిమా అంటే తపన. ప్రతి సినిమాకు కొత్తదనం ఇవ్వాలనుకుంటాడు. మా ఇద్దరి మధ్య సారూప్యత అదే’ అని బాలకృష్ణ అన్నారు.
ఈ సినిమాను దర్శకుడు కృష్ణచైతన్య తెరకెక్కించారు. ఈ మూవీ విలేజ్ బ్యాక్‌డ్రాప్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. విశ్వక్‌కు జోడీగా యంగ్ బ్యూటీ నేహా శర్మ నటించింది. అంజలీ, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, గోపరాజు రమణ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.