టాలీవుడ్ సూపర్‌స్టార్ సతీమణి నమ్రత సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటుంటారు. వ్యక్తిగత విషయాలతోపాటు మహేశ్ సినిమా విశేషాలను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె మహేశ్, సితార ఉన్న ఫొటోను పంచుకున్నారు. నిద్రపోతున్నారని నమ్మకండి, వాళ్లు నటిస్తున్నారంటూ ఫొటో సీక్రెట్ బయటపెట్టారు. ఈ ఫొటోకు తెగ కామెంట్లు వచ్చాయి. ‘చూడచక్కగా ఉన్నారు, క్యూట్, స్వీట్ డ్రీమ్స్, మహేశ్ ఏం చేసినా క్యూట్‌గా ఉంటుంది..’ అని తెగ కామెంట్లు చేశారు. కొన్ని గంటల్లోనే దాదాపు 85 వేల మంది ఫొటోను లైక్ చేశారు.
కొన్ని రోజుల క్రితం ఇలానే నమ్రత తన ఫ్యామిలీ సీక్రెట్‌ను అభిమానులతో పంచుకున్నారు. సితార, గౌతమ్ తన తండ్రితో మాట్లాడుతున్న ఫొటోను షేర్ చేసి.. ‘అమ్మ కాదనడంతో నాన్నతో డీలింగ్స్ కుదుర్చుకుంటున్నారు’ అని రాశారు. మహేశ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.