సూపర్‌స్టార్ మహేష్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో మీసకట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ లుక్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. తాజాగా ఈ లుక్ గురించి మహేష్ భార్య నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారు. ‘కృత్రిమంగా అమర్చేవి (ఈ సందర్భంలో మీసం) ఎప్పుడూ వాస్తవికంగా కనిపించవు. వాటితో షూటింగ్ చేయాల్సి వచ్చినపుడు కచ్చితంగా సౌకర్యవంతంగా లేదా సరదాగా ఉండదు. అయితే తమ వైపు నిపుణులు ఉన్నప్పుడు సవాళ్లను ఇష్టపడనిదెవరు` అని నమ్రత కామెంట్ చేశారు. మహేష్ మేకప్ వేసుకుంటున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.