Nara Lokesh Red Book Secrets:
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆయన ప్రారంభించిన రెడ్ బుక్ యాక్షన్ ప్రణాళిక ద్వారా న్యాయాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
“రెడ్ బుక్‌లో చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లు ఉంటాయి. వారు చేసిన తప్పులన్నింటికి సంబంధించిన చర్యలు చట్టప్రకారం చేపడతాం” అని లోకేష్ స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా ఆయన విజయవాడలో వరద సహాయం గురించి ప్రచారంలో ఉన్న ఫేక్ న్యూస్‌పై కూడా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలను తారుమారు చేసే అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సమానంగా అభివృద్ధి చెందాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని లోకేష్ పునరుద్ఘాటించారు. “ప్రతీ ప్రాంతం అభివృద్ధిలో భాగమవ్వాలి” అని పేర్కొన్నారు. పొటెన్షియల్ ఇన్వెస్టర్లకు నమ్మకం కల్పిస్తూ, “రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక సంస్థలను అడ్డుకునే వారిని, ముఖ్యంగా బ్లూ బ్యాచ్ (వైఎస్సార్సీపీ) సభ్యులను ఉపేక్షించేది లేదు” అని నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు.
“వారు ఏ పుస్తకాన్ని చదువుతున్నారో వారికి అర్థం కావడం లేదు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కియా, టీసీఎస్, లులు, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయనే విషయాన్ని ఆయన గర్వంగా వెల్లడించారు.
Read More: CBN సంచలన ఆదేశాలు! ప్రభుత్వ అధికారులకు పెద్ద షాక్!