HomeTelugu Big Storiesనమస్తే ట్రంప్‌..

నమస్తే ట్రంప్‌..

9eT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా నమస్తే ట్రంప్ కార్యక్రమం మొతెరా స్టేడియంలో ప్రారంభమయ్యింది. నమస్తే ట్రంప్ అంటూ మూడుసార్లు పలుకుతూ మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాస్వామ్య దేశంలో మీకు ఘన స్వాగతం అంటూ ప్రసంగించారు. భారత్ అమెరికా సంబంధం కలకాలం వర్దిల్లాలని ఆకాంక్షించారు. ఇది కొత్త చరిత్రకు శ్రీకారమన్నారు. అప్పుడు హౌడీ మోడీ. దానికి కొనసాగింపుగా ఇప్పుడు నమస్తే ట్రంప్ అని మోడీ తెలిపారు. ట్రంప్ పాలనలో భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. ట్రంప్ కుటుంబానికి మా తరపున అభినందనలు తెలిపారు. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా రావడం మాకు చాలా సంతోషం కలిగించిందన్నారు మోడీ. సమాజంలో పిల్లల కోసం మెలానియా ట్రంప్ ఎంతగానే పాటుపడుతున్నారన్నారు.

ఇవాంక ట్రంప్ మరోసారి భారత్ వచ్చినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి భారత్ వస్తానని ఇవాంక ట్రంప్ అన్న మాటను నిలబెట్టుకున్నారన్నారు మోడీ. ఇవాంక ట్రంప్, ఆమె భర్తను పేరు పేరున ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.

9 21

అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమస్తే నమస్తే… అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మోడీని ప్రశంసలతో కొనియాడారు. మోడీ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసించారు. రాత్రి, పగలు దేశం కోసం పాటుపడుతున్న వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు. అమెరికా ఎప్పుడూ ఇండియాను ప్రేమిస్తుందన్నారు. భారత్‌ను గౌరవిస్తుందన్నారు. ఇండియా పట్ల అమెరికా నమ్మకంగా ఉంటుందన్నారు. మొతేరా స్టేడియం చాలా బావుందంటూ కొనియాడారు. ఇండియాకు రావడం గర్వంగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. భారత్ ను చూసి గర్వపడుతున్నానన్నారు. మోడీ వెరీ టఫ్ ఆయనను అందరూ ఇష్టపడతారన్నారు.

మోడీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిని సాధిస్తుందన్నారు. నా నిజమైన మిత్రుడు మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. భూప్రపంచం మీద మోడీ గొప్ప నేత అన్నారు. బాలీవుడ్ సినిమాలను కూడా ట్రంప్ ప్రశంసించారు. ప్రపంచానికి గొప్ప క్రికెటర్లను అందించిన దేశం భారత్ అన్నారు. సచిన్, విరాట్ కొహ్లీ వంటి గొప్ప క్రీడాకారుల్ని భారత్ అందించిందన్నారు. భారత్ పండుగలు దీపావళి, హోలీ వంటి వాటిని కూడా ట్రంప్ ప్రస్తావించారు. అనేక మతాలు, భాషాలు గల భారత్ ప్రపంచానికి ఎంతో ఆదర్శమన్నారు. భారత్‌లో ఏడాదికి 2 వేల సినిమాలు నిర్మిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

ఉగ్రవాదంపై కూడా ట్రంప్ గళమెత్తారు. ఉగ్రవాదాన్ని అమెరికా ఏ మాత్రం సహించదన్నారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రతీదేశం కృషి చేయాలన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతుందన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. ద్వైపాక్షిక సంబంధం బలోపేతానికి మోడీ, తాను కృషి చేస్తున్నామని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu