HomeTelugu Big Storiesవర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నగ్నం బ్యూటీ..

వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నగ్నం బ్యూటీ..

10
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్య రూట్‌ మార్చి.. వరసగా బూతు సినిమాలు రూపొందిస్తున్నాడు. తాజాగా డిజిటల్ మూవీ “నగ్నం” ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగును నెల రోజుల్లో పూర్తి చేశామని కేవలం రెండు వేల రూపాయలతో సినిమాను రూపొందించినట్లుగా వర్మ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. ఇదే అంశంపై ఆ సినిమాలో నటించిన స్వీటీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

స్వీటీ ఒక మీడియా సంస్థ తో మాట్లాడుతూ… నా అసలు పేరు శ్రీ రాపాక అని.. నాది వెస్ట్ గోదావరి జిల్లా. రాంగోపాల్ వర్మ గారు హీరోయిన్ కోసం వెదుకుతున్నట్లుగా తెలిసింది. అప్పటికే ఆయన ఎనిమిది మందిని చూశాడే. కానీ ఆయనకు వారు ఎవరు నచ్చకపోవడంతో.. నన్ను ఎలా ఉంటావో అలాగే రామన్నారు. ట్రెడిషనల్ గా వెళ్తే రామ్ గారికి నచ్చదేమో అనుకున్నాను. కానీ ఎలా ఉంటే అలాగే రమ్మన్నారు. అందుకే అలానే వెళ్ళాను. నన్ను చూసిన తర్వాత ఆయన నా హైట్‌ అడిగారు. నాకు కథను వినిపించారు. సినిమా షూటింగ్ రేపటి నుండి అని చెప్పారు. సినిమా నెల రోజులు అన్నారు కానీ రెండు వారల్లోనే పూర్తి అయింది. షూటింగ్ రెండు రోజులు గంట డబ్బింగ్ మిగిలిన రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. ఈ సినిమా లో న్యూడ్ గా నటించాల్సిన అవసరం లేదు. కానీ కాస్త హాట్ గా కనిపించాల్సి వచ్చింది. కొన్ని సినిమాలో చూపిన విధంగా కాకుండా మరోలా తీశారు. కానీ అవి మాత్రం ప్రేక్షకులకు నగ్నంగా నటించినట్లుగా అనిపించింది. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను నేను ఎంత అడిగితే అంత ఇవ్వమని వర్మ చెప్పారు. నేను రెండు రోజులకు రెండు లక్షలు ఇవ్వమని అడిగాను. అది ఇచ్చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత కొందరు ఇంకాస్త పారితోషికం డిమాండ్ చేయమన్నారు. కానీ నేను అదేమి చేయలేదు. వర్మ గారు అతి తక్కువ సమయంలోనే సినిమా తీశారు. అందుకే ఆయన ఇండియాలోనే గొప్ప టెక్నీషియన్ అంటూ వర్మ పై ప్రసంశలు కురిపించింది స్వీటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu