ప్రమోషన్స్ కు బంక్ కొడుతున్న హీరో!
సినిమా తీయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. సినిమాలకు ప్రచారం ఎంత ముఖ్యమో తెలియంది కాదు. మా సినిమా వస్తోంది చూడండి అంటూ చిత్రబృందమంతా గొంతు చించుకోని అరవాల్సిందే. లేదంటే ఎంత పెద్ద సినిమా అయినా వర్కవుట్ అవ్వదు. మహేష్, పవన్‌లాంటి వాళ్లే ప్రమోషన్ ప్రాధాన్యత తెలుసుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. కానీ కుర్ర హీరో నాగశౌర్య మాత్రం ప్రమోషన్లను లైట్ తీసుకొంటున్నాడని వినికిడి. నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘ఒక మనసు’. రామరాకు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్లపై నాగశౌర్య పెద్దగా దృష్టి పెట్టడం లేదని టాక్. ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా.. నిహారిక గురించే మాట్లాడుతున్నారట. ‘ఒక మనసు’ అనగానే అందరికీ నిహారికనే గుర్తొస్తుందని, తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాబు బాగా ఫీలవుతున్నాడని టాక్. అందుకే ఈ సినిమా ప్రమోషన్లకు దొరక్కుండా దర్శక నిర్మాతల్ని నాగశౌర్య ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.