HomeTelugu Trendingసమంత- చైతన్య విడాకుల ట్రోల్స్‌పై నాగార్జున స్పందన

సమంత- చైతన్య విడాకుల ట్రోల్స్‌పై నాగార్జున స్పందన

Nagarjunas response to Nag

నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోని మూడు నెలలవుతున్నా.. ఇప్పటికీ పలు పుకార్ల వస్తున్నాయి. ఈ పుకార్లపై ఇటు సమంత, అటు నాగచైతన్య ఇద్దరూ వివరణ ఇచ్చేశారు. వాటిపై తాజాగా నాగార్జున కూడా స్పందించారు. బంగార్రాజు సక్సెస్ తో జోష్ లో ఉన్న ఆయన.. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత- చైతన్య విడాకులపైనా స్పందించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కావాలనే కొందరు ఇలాంటి చెత్త ప్రచారాలు చేస్తున్నారని, ఇద్దరి విడాకులపై లేనిపోనివి పుట్టిస్తున్నారని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్లలో ఇలాంటి వాటికి కొదవ లేకుండా పోయింది. తనపై ఇలాంటి చెత్త ప్రచారాలు చేసినా పట్టించుకోలేదని, పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అనే సూక్తిని తాను నమ్ముతానని, అందుకే వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు. అయితే, తన కుటుంబం గురించి అలాంటి చెత్త కథనాలు ప్రసారం చేసే సరికి బాధపడ్డానని నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాటిని తాను పట్టించుకోనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu