Naga Chaitanya-Sobhita wedding:
టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని తాజాగా లగ్జరీ లెక్సస్ LM MPV కొనుగోలు చేశారు. ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం తన కుమారుడు Naga Chaitanya-Sobhita పెళ్లికోసం కొన్న గిఫ్ట్ అని తెలుస్తోంది.
లెక్సస్ LM MPV కార్ అందంగా ఉండటమే కాదు, పర్యావరణాన్ని రక్షించేందుకు కార్బన్ న్యూట్రల్ టెక్నాలజీతో రూపొందించబడింది. నాగార్జున కొనుగోలు చేసిన ఈ కార్ అందంగా మెరిసే గులాబీ రంగులో ఉంది. లెక్సస్ కంపెనీ ప్రకారం, ఈ కారు బేస్ మోడల్ ధర రూ. 2.1 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, నాగార్జున ఎల్లప్పుడూ ప్రీమియం ఫీచర్లు కోరుకునే వ్యక్తి కాబట్టి, ఫుల్-లోడెడ్ వెర్షన్‌ను ఎంచుకున్నారు. దీని విలువ అక్షరాల 2.5 కోట్లు.
Nagarjuna is the hero who made noise in Khairatabad RTA office Hero Nagarjuna came to Khairatabad RTA office for registration of his new car Hero Nagarjuna poses for the registration of his new Toyota Lexus vehicle. Akkineni Nagarjuna #nagarjunaakkineni #NewCar #RTA pic.twitter.com/sPOAX4GeY5
— Media5Zone News (@media5zone) November 28, 2024
నాగచైతన్య వివాహానికి కానుక
నాగచైతన్య, సోభిత ధూళిపాళల డిసెంబర్ 4న జరగనున్న వివాహానికి ముందుగానే ఈ లగ్జరీ కార్‌ను గిఫ్ట్‌గా అందించారు నాగ్. వివాహ వేడుకలను నాగార్జున కుటుంబం ఘనంగా ప్లాన్ చేసింది. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే వైభవంగా ప్రారంభమయ్యాయి.
సమాజిక మాధ్యమాల్లో నాగార్జున తన కొత్త లెక్సస్ LM MPV డ్రైవ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ లగ్జరీ కార్ స్టైల్ చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ: Pushpa 2: The Rule ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే!