HomeTelugu Trending2024 తర్వాత రూట్ పూర్తిగా మార్చేసిన Nagarjuna!

2024 తర్వాత రూట్ పూర్తిగా మార్చేసిన Nagarjuna!

Nagarjuna's bold career move to become a turning point?
Nagarjuna’s bold career move to become a turning point?

Nagarjuna Latest Movies:

అక్కినేని Nagarjuna తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్ హీరోలలో ఒకరు. అయితే ఇప్పుడు ఆయన కెరీర్‌లో మార్పు వస్తోంది. సొలో ప్రాజెక్టులు తగ్గిపోవడం గమనార్హం. 2024లో నాగార్జున నటించిన ఏకైక సినిమా నా సామి రంగ. ఇది కూడా ఒకరకంగా మల్టీస్టారర్ సినిమా. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.

నాగార్జున మంచి హిట్ సంపాదించినా, ఇది మల్టీస్టారర్ కావడంతో ఆయన అభిమానులు కొంత నిరాశ చెందారు. బిగ్ బాస్ 8 తెలుగు షోకి హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించారు. కానీ ఈ సీజన్‌లో కొందరు సెలబ్రిటీలకు మద్దతు ఇస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. ఈ సమస్యల మధ్య 2024లో నాగార్జున తన భవిష్యత్ కెరీర్ గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

పెద్ద సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ఆయన గ్రహించారు అని తెలుస్తోంది. అందుకే, పెద్ద ప్రాజెక్ట్‌లలో భాగమవడం, తన వయసుకు తగిన పాత్రలను ఎంపిక చేయడం మంచిదని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో నాగార్జున 2025లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి కుబేర అనే మల్టీస్టారర్‌ను సైన్ చేశారు. అలాగే, రజనీకాంత్‌తో కూలీ అనే తమిళ సినిమా చేశారు. ఈ రెండు సినిమాల్లో ఆయన ప్రత్యేకమైన పాత్రలు చేస్తున్నారు.

2025లో నాగార్జున యువ దర్శకులతో కొన్ని సొలో ప్రాజెక్టులు కూడా చేయడానికి సిద్దమయ్యారు. కానీ పెద్ద నటీనటులతో కలిసి పనిచేయడమే ఆయన ప్రాధాన్యంగా చూసుకుంటున్నారు. ఇది ఆయన కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

ALSO READ: Zakir Hussain నెట్ వర్త్ ఎంతో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu