HomeTelugu Newsనాగార్జున సపోర్ట్ చేయడం అభినందనీయం: దాసరి!

నాగార్జున సపోర్ట్ చేయడం అభినందనీయం: దాసరి!

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ బేనర్స్‌పై కాన్సెప్ట్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి చిత్రం ‘నిర్మలా కాన్వెంట్‌’. సెప్టెంబర్ 16న సినిమా విడుదలైంది. ఈ సినిమాను రీసెంట్ గా దర్శకరత్న డా.దాసరి నారాయణరావు వీక్షించారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
దర్శరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ”నిర్మలా కాన్వెంట్ తో ఓ యంగ్ టీం పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మూడో జనరేషన్ పరిచయం అయ్యింది. రోషన్ ఎప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడో ఏమో కానీ అప్పుడే హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ సాలూరి పరిచయం అయ్యాడు. సాలూరి రాజేశ్వరరావు మనవడు రోషన్ సాలూరి ఈ సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉంది. నా శిష్యుడు ధవళసత్యం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జి.నాగకోటేశ్వరరావు ఈ సినిమాకు పరిచయం అయ్యాడు. ఇప్పటి ట్రెండ్ కి తగిన విధంగా సినిమాను చాలా ఫ్రెష్ లుక్ తో తీశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. లవ్ కోసం చాలెంజ్ చేసిన హీరో నాలెడ్జ్ ను పెంచుకుని ఎలా గెలిచాడనే కాన్సెప్ట్ లో రోషన్ చక్కగా నటించాడు. హీరో క్యారెక్టర్ ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్లుంది. నేను కూడా చిన్న వాడిగా కెరీర్ స్టార్ట్ చేసి 150 సినిమాలు చేసిన దర్శకుడిగా మారాను. నాగార్జున సెకండాఫ్ లో చాలా మంచి రోల్ చేశాడు. ఇలాంటి ఓ చిత్రానికి నాగార్జున అందించిన సపోర్ట్ అభినందనీయం” అన్నారు.
చిత్ర దర్శకుడు జి.నాగకోటేశ్వరరావు మాట్లాడుతూ.. ”దర్శకులకు స్టార్ ఇమేజ్ తెచ్చిన దాసరి నారాయణరావుగారు నా గురువుకు గురువు. ఈరోజు నా డైరెక్షన్ లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ ను ఆయన అభినందించడం ఆనందంగా ఉంది. రోషన్ ఒక హీరో అయితే సెకండాఫ్ అంతా నాగార్జున గారే హీరో. నాగార్జునగారు అందించిన సహకారం మరచిపోలేనిది. మ్యాట్రిక్స్ ఫ్రసాద్ గారికి థాంక్స్. రెండవ వారం కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్” అన్నారు.
హీరో రోషన్ మాట్లాడుతూ.. ”ఎప్పుడు గురువుగారు దాసరిగారిని టీవీల్లో చూడటమే కానీ నేరుగా కలిసింది లేదు. ఇప్పుడు ఆయన మా సినిమాను చూసి మమ్మల్ని అభినందించడం ఆనందంగా, ఎగ్జయిటింగ్ గా ఉంది” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ సాలూరి మాట్లాడుతూ.. ”మా తాతగారు, నాన్నగారు దాసరిగారి వద్ద వర్క్ చేశారు. ఇప్పుడు నేను ఆయన వద్ద పనిచేయకపోయినా ఆశీర్వాదం దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజును మరచిపోలేను” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu