HomeTelugu Trending'బంగార్రాజు' పనులు మొదలెట్టిన నాగ్‌

‘బంగార్రాజు’ పనులు మొదలెట్టిన నాగ్‌

7 20
కింగ్‌ నాగార్జున హీరోగా గతంలో కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాగార్జున కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకి విశేషమైన అదరణ లభించింది. దాంతో ఆ పాత్ర పేరుతో సీక్వెల్ చేయడానికి నాగార్జున ఆసక్తిని చూపించారు.

అయితే ఇతర ప్రాజెక్టులతో నాగార్జున బిజీగా ఉండటం వలన .. కల్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇప్పడు ఈ ప్రాజెక్టు ముందుకు కదిలినట్టు తెలుస్తోంది. కథపై కసరత్తు పూర్తిచేసిన కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్ తో కలిసి మ్యూజిక్ సిటింగ్స్ లో పాల్గొంటున్నాడని సమాచారం. మార్చి 3వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. నాగార్జున – రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో, నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu