Nagarjuna Twitter: తమ అభిమాన హీరోలు కనిపిస్తే వారితో సెల్ఫీ దిగాలని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. అది చాలా సహజం. కానీ ఎప్పుడు సెక్యూరిటీతోనే బయటకు వచ్చే సెలబ్రిటీలను కలవడానికి వెళ్లాలంటే ముందు ఆ బాడీ గార్డులను కూడా దాటాలి. కొన్నిసార్లు ఆ సెలబ్రిటీలను కలిసేలోపే ఆ బాడీ గార్డులు అభిమానులను పక్కకు తోసేస్తూ ఉంటారు. అక్కినేని నాగార్జున విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది.
తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న నాగార్జున వద్దకి సెల్ఫీ కోసం ఒక అభిమాని వచ్చాడు. కానీ నాగార్జున అతడిని చూసే లోపే నాగార్జున బాడీగార్డ్ ఆ వ్యక్తిని గట్టిగా లాగి పక్కకు తోసేసాడు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
నాగార్జున వద్దకు వచ్చిన ఆ అభిమాని ఒక వికలాంగుడు. అక్కడే దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటారు. దీంతో అభిమానులు సైతం నాగార్జున మీద ఫైర్ అయ్యారు. బాడీగార్డ్ అలా చేసినప్పటికీ నాగార్జున ఏమాత్రం రియాక్ట్ అవ్వకపోవడం ఏంటి అని అసలు మానవత్వమే లేదా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే నాగార్జున ఆ వ్యక్తిని గమనించలేదు అని వీడియోలో క్లియర్ గా తెలుస్తోంది. నిజంగానే నాగర్జున ఆ వ్యక్తిని గమనించి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే నాగర్జున సోషల్ మీడియా ద్వారా ఆ వ్యక్తికి క్షమాపణలు తెలిపారు.
“నేను ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నాను. ఇలా జరిగి ఉండకూడదు. ఆ వ్యక్తికి నా క్షమాపణలు. ఇకపై అలా జరగకుండా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను” అని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు నాగార్జున. దీంతో అభిమానులు కూడా కొంత కూల్ అయ్యారు.
Nagarjuna Movie Update:
ఇక సినిమాల పరంగా నాగార్జున ఈ మధ్యనే.. నా సామిరంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రివ్యూస్ అందుకుంది.. కానీ కలెక్షన్లు మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాగార్జున కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కుబేర అనే సినిమాలో నటిస్తున్నారు.