HomeTelugu Trendingరూమర్లపై స్పందించని నాగార్జున

రూమర్లపై స్పందించని నాగార్జున

Naa Saami Ranga
నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగా’. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ గురించి కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగార్జున నా సామిరంగా చిత్రం సంక్రాంతికి విడుదల కావడం కష్టమేనని ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే చిత్రబృందం మాత్రం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. రూమర్స్‌ను పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమై ఉంది.

సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాలంటే కష్టమేనని, సంక్రాంతి బరిలో ఉండదేమో అంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే నా సామిరంగా చిత్ర యూనిట్‌ మాత్రం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. సంక్రాంతి నాగార్జునకు సెంటిమెంట్. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో సంక్రాంతి బరిలోనే సక్సెస్ అందుకున్నాడు.

ఈసారి నాసామిరంగా సినిమాను సంక్రాంతికి బరిలో దింపి మరో సక్సెస్ కొట్టాలని నాగార్జున ఆలోచన. ఈ సీజన్‌ను నాగార్జున వదులుకోరనే అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu