మనదేశంలోను కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 800కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సినిమా పరిశ్రమ కూడా మూత పడింది. దీంతో పలువురు హీరోలు నటులు సినీ కార్మికుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. కాగా తాజాగా ఆ లిస్టులో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా చేరారు. ఆయన కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ లాక్ డౌన్ మనకి అత్యంత అవసరం అని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని అయన పిలుపునిచ్చారు.