టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫుల్ స్పీడ్ మీదున్నాడు. కరోనా సమయంలోనూ జోరు చూపించిన నాగ్ ఓ వైపు బిగ్‌బాస్ షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు వైల్డ్ డాగ్ సినిమాను పూర్తిచేశాడు. ఇవి రెండూ పూర్తికావడంతో రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్లాడు. ఈ వారంలో తిరిగి రాబోతున్న నాగార్జున వెంటనే మరో సినిమా ప్రారంభించబోతున్నాడు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ డ్రాఫ్ట్‌ను పూర్తి చేయాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు నాగార్జున డెడ్‌లైన్ పెట్టారట. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహనరావు నిర్మిస్తున్నారు.