టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ”వైల్డ్ డాగ్”. వాస్తవ సంఘటనలను ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నాడు. లాక్డౌన్ అనంతరం ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. మనాలిలో 21 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. దాదాపు 13వేల అడుగుల ఎత్తులో జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. దీంతో ఈ మూవీలో నాగార్జున పార్ట్ షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. తాజాగా నాగార్జున ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ నేటితో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్ టీమ్ కు హిమాలయాస్ కు గుడ్ బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది” అని నాగార్జున ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను నాగార్జున షేర్ చేశారు.
Heading home after wrapping up my work for #WildDog !!feeling sad as I say good bye to my talented team and the Himalayas!! #manali @MatineeEnt @SaiyamiKher @ActorAliReza @onelifeitiz @mayankparakh19 @bilal06858696 pic.twitter.com/Ur3V5OH9if
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 6, 2020