Akhil Periodic Movie:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా గోవిందుడు అందరివాడేలే బ్రూస్లీ వంటి ఫ్లాప్ సినిమాలు అందుకున్న తర్వాత ధ్రువ సినిమా హిట్ అయింది. కానీ భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. అదే సమయంలో రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం అనే సినిమాలో నటించారు.
పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకొని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటినుంచి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సాగే సినిమా కథలు కూడా ఎక్కువయ్యాయి. ఇక టాలీవుడ్ లో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలతో మంచి హిట్లు అందుకున్న హీరోలలో ఒకరు అక్కినేని నాగార్జున.
ఈ మధ్యకాలంలో నాగర్జున హీరోగా నటించి హిట్ అయిన సినిమాలు సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు, నా సామి రంగా సినిమాలు పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలే. కాబట్టి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాల మీద నాగార్జునకి గట్టి నమ్మకం వచ్చేసింది.
ఈ నేపథ్యంలోనే వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న అఖిల్ కి కూడా అలాంటి ఒక కథని వెతకడం మొదలు పెట్టారట. మరోవైపు వినరో భాగ్యం విష్ణు కథ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అబ్బూరి మురళీకృష్ణ కూడా అలాంటి రంగస్థలం లాంటి ఒక పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ లో నడిచే ఒక సినిమా కథని మాస్ మహారాజా రవితేజ కి వినిపించారట.
కానీ ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ సినిమాలు చేస్తూ ఫ్లాప్స్ అందుకుంటున్న రవితేజ మళ్ళీ ధమాకా లాంటి కొంచెం ఎంటర్టైనింగ్ సినిమా చేసి హిట్టు అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి నో చెప్పారు. అది తెలుసుకున్న నాగార్జున మురళిని పిలిచి మరీ కథ చెప్పమని అడిగారట.
కథ కూడా బాగా నచ్చడంతో నాగార్జున వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలుస్తోంది. నాగార్జునకి ఈ మధ్యకాలంలో చాలా బాగా వర్కౌట్ అయిన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాతో ఇప్పుడు అఖిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న అఖిల్ ఎంతవరకు ఇప్పుడు హిట్ అందుకుంటారో చూడాలి.