HomeTelugu Big Storiesరకుల్‌పై టాలీవుడ్‌ మన్మధుడు కోపం

రకుల్‌పై టాలీవుడ్‌ మన్మధుడు కోపం

5 17టాలీవుడ్‌ ‘కింగ్’ అక్కినేని నాగార్జున.. సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌పై కోపంగా ఉన్నారట. నాగ్‌, రకుల్‌ జంటగా ‘మన్మథుడు 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రకుల్‌ నటించిన ‘దే దే ప్యార్‌ దే’ చిత్రం కోసం ఆమె పది కిలోలు తగ్గారు. దాంతో ఆమె చూడటానికి మరీ సన్నగా ఉన్నారు. కానీ ‘మన్మథుడు 2’ సినిమాలో రకుల్‌ కాస్త లావుగా కన్పించాల్సి ఉంది.
దాంతో వీలైనంత త్వరగా బరువు పెరగాలని దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ రకుల్‌కు చెప్పారట. ఇప్పటికే చిత్రీకరణ మొదటి భాగం పోర్చుగల్‌లో జరుగుతోంది. దాంతో బరువు విషయంలో నాగ్‌.. రకుల్‌పై కోపంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై రాహుల్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తూ..

‘సినిమాలో రకుల్‌ పాత్ర గురించి లేనిపోని వార్తలు వస్తున్నాయి. పోర్చుగల్‌ షెడ్యూల్‌లో రకుల్‌ మాతో చిత్రీకరణ మొదలైన రోజు నుంచి ఉన్నారు. మొదటి భాగమంతా ఆమెతోనే చిత్రీకరిస్తున్నాం. ఆమె ఇంత అందంగా ఎలా ఉంటారా.. అని మేమంతా మాట్లాడుకుంటుంటాం. సినిమాలో ఆమె ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం. రకుల్‌లో ఎంతో ప్రతిభ ఉంది’ అని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నాగార్జున కోడలు సమంత అతిథి పాత్రలో నటిస్తున్నారు. మామయ్య సినిమాలో నటించబోతున్నందుకు, అందులోనూ తన బెస్ట్‌ ఫ్రెండ్ అయిన రాహుల్‌ దర్శకత్వంలో పనిచేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu