Nagarjuna to Chiranjeevi:మూవీ ఇండస్ట్రీల్లో హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మూవీ బడ్జెట్‌లో ఎక్కువ శాంత వీరి రెమ్యునరేషన్‌కే ఉంటుంది. ప్రస్తుతం ఏ భాషలో చూసిన పాన్ ఇండియా మూవీల హవానే నడుస్తుంది. దీంతో హీరోల రెమ్యునరేషన్‌కి రెక్కలు వచ్చాయి. మన టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఒక్క సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టైర్ 2 హీరోలు కూడా 30 నుంచి 40 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో వారు చాలా రిచ్చ్‌గా మారిపోతున్నారు. దీంతో భారీగా ఆస్థులు కూడబెడుతున్నారు.
అయితే కొందరు హీరోలు స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు… వారిలో అత్యంత ధనవంతులుగా మారుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. కాని ఒకప్పుడు మాత్రం ఎన్టీఆర్, ఎఎన్నార్ , కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు.. ఇలా కొద్దిమంది హీరోలు మాత్రమే ఉండేవారు. ఆతరువాత కాలంలో హీరోలు పుట్టలు మాదిరి పుట్టుకొచ్చారు. పోటా పోటీగా సినిమాలు చేస్తున్నారు.
ఒకప్పుడు హీరోల రెమ్యూనరేషన్ లక్షల్లో ఉండేది. అది ఇప్పుడు కోట్లకు వందల కోట్లకు పెరిగింది. అయితే పాత తరం నుండి హీరోలు తమ సంపాదనను స్థలాలు, బంగారం, ఇతర బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ రావడంతో.. వారి సంపద కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. అలానే చాలా మంది టాలీవుడ్ హీరోలు వేల కోట్లకు అధిపతులు అయ్యారు.. అవుతూనే ఉన్నారు.
టాలీవుడ్ లో అలా సంపాదన గట్టిగా ఉన్న హీరోలలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అక్కినేని నాగార్జున. ఆయన మంచి హీరో మాత్రమే కాదు.. మంచి బిజినెస్ మెన్ కూడా. కమర్షియల్ గా ఆలోచించి.. పక్కా ప్లానింగ్ తో వేల కోట్లకు అధిపతిగా ఎదిగాడు నాగర్జున. ఇక దీనితో పాటు అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన సంపాదనలో ఎక్కువ శాతం నాగార్జునకే దక్కింది. ఇటు హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తూ.. అటు తన తండ్రి ఇచ్చిన ఆస్తిని.. స్టూడియోలను పెంచుకుంటూ.. పోతున్నాడు. ఇక నాగార్జునకు ఒక అన్న ఉండగా.. ఆయనకూడా బిజినెస్ లలో రాణిస్తూ.. బాగా సంపాదించినట్టు సమాచారం. ఇటు నాగార్జున ఒక్కడి ఆస్తి.. దాదాపు దాదాపుగా 12 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.
టాలీవుడ్ లో తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కష్టపడి ఎదిగి తెలుగు ఇండస్ట్రీలో మెగా సాంమ్రాజ్యాన్ని స్థాపించాడు చిరంజీవి. 70 ఏళ్ళకు దగ్గరగా ఉన్నా.. మెగాస్టార్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సినిమాకు 50 కోట్లకు పైనే తీసుకుంటున్నారట. 157 సినిమాలు చేసిన చిరంజీవి.. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దాదాపు ఎన్నో ప్యాపారాల్లో ఓ చేయి వేసి ఉన్నారు. దాదాపు ఆస్తి అంతా కలుపుకుని దాదాపు 8 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచన.
తరువాత స్థానంలో విక్టరీ వెంకటేష్ ఉన్నాడు. ఆయన సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడు. రామానాయుడు వారసుడిగా.. ఎంట్రీ ఇచ్చి.. సోంతంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రామానాయుడు నుంచి వచ్చిన ఆస్తి.. వెంకటేష్ సంపాదించుకున్న ఆస్తి అంతా.. కలుపుకుని.. దాదాపు 5 వేల కోట్లు ఉంటుందని టాక్.
ఇక బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. ప్రస్తుతం రాజకీయంగా కూడా బలంగా ఉన్నాడు. బిజినెస్ లు అంటూ పెద్దగా పరుగులు పెట్టలేదు అందుకే.. సంపాదనపై కూడా ఆయనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఉన్న ఆస్తిని కాపాడుకుంటూ.. సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు బాలయ్య.. ఆయన ఆస్తి దాదాపు మూడు వేల కోట్లు ఉంటుందని అంచన.