HomeTelugu Newsచంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: రోజా

చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: రోజా

9 21నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ లీజునుతమ ప్రభుత్వం రద్దు చేస్తే, అది తామే చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ బాక్సైట్ తవ్వకాల లీజును రద్దు చేశారని రోజా అన్నారు. నగిరిలో మెప్మా బజార్, మెప్మా ఫుడ్ ఫెస్టివల్‌లో పాల్గొని రోజా పౌష్టికాహారాలను రుచి చూశారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేతపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు రోజా. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఐదు జీవోలను ఉత్తర్వులు జారీ చేస్తే రద్దుచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు చేసింది మేము రద్దు చేశామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుని ఏ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలో ప్రజలే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గిరిజనులు ఎమ్మెల్యే లను ఎలా కొన్నారు ? బాబు చేసే తప్పుడు పనులకు గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతులలో మృతి చెందాడని ఆమె చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu