విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని అనేక వాయిదా పడింది. ‘ఎఫ్2’ తర్వాత మే 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమా సెట్లో చిత్రబృందానికి చుక్కలు చూపించింది నాగరత్తమ్మ అలియాస్ ‘ఫ్రస్టేటెడ్ ఉమెన్’ ఫేమ్ సునయన. అయితే ఎఫ్-3 చిత్రం రిలీజయ్యే వరకూ నీడలా వెంటాడతానని ఇదివరకు శపథం చేసిన నాగరత్తమ్మ.. అన్నట్లే చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ ఇతర టీం సభ్యులతో ఆమె కొంతసేపు ముచ్చటించి సరదాగా గడిపింది. అనంతరం వాళ్లతో ఫొటోలు దిగింది. సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకెళ్తోంది.