నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్, చార్లే తదితరులు
సినిమాటోగ్రపీ: సెల్వకుమార్ ఎస్.కె
సంగీతం: జావేద్ రియాజ్
ఎడిటింగ్: ఫిలోమిన్
ప్రొడక్షన్: పొటెన్షియల్ స్టూడియోస్
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తమిళ చిత్రం ‘మానగరం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నగరం’ పేరుతో మార్చి 10న విడుదల చేయబోతున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో.. ముందుగానే రివ్యూ క్లాప్ బోర్డ్ వ్యూయర్స్ కోసం..
కథ:
రెజీనా ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో హెచ్ఆర్ గా పని చేస్తూ ఉంటుంది. సందీప్, రెజీనా ప్రేమ కోసం తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆమె కంపనీలో జాయిన్ కావడానికి శ్రీ అనే అబ్బాయి ప్రయత్నించి ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ మరుసటి రోజు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను ఆఫీస్ లో అప్పగించాల్సి ఉంటుంది. కానీ అదే రోజు రాత్రి సందీప్ కిషన్ అనుకొని శ్రీ ను పట్టుకొని కొందరు రౌడీలు కొడతారు. ఆ గొడవలో శ్రీ సర్టిఫికేట్స్ పోగొట్టుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఆ నగరానికి మాఫియా డాన్ లాంటి పికెపి(మధుసూదన్) కొడుకుని కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. అదే సమయంలో వూరు నుండి చెన్నై వచ్చిన క్యాబ్ డ్రైవర్(చార్లే) పికెపి ట్రావెల్స్ లో క్యాబ్ ను అద్దెకు తీసుకుంటాడు. ఈ పాత్రలన్నింటినీ ఏకం చేస్తూ.. దర్శకుడు రాసుకున్న కథే ఈ నగరం. మరి రెజీనా, సందీప్ ను ప్రేమిస్తుందా..? శ్రీకు తన సర్టిఫికెట్స్ దొరుకుతాయా..? అసలు
కిడ్నాప్ డ్రామా ఏంటి..? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం నగరం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
నాలుగు పాత్రలకు వేర్వేరు సంధార్భాల్లో వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనలను ఒక మెయిన్ ప్లాట్ దగ్గరకు తీసుకొచ్చే కథనాన్ని చాలా త్రిల్లింగ్ గా రూపొందించాడు దర్శకుడు. ఎక్కడ టైమ్ వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా కథలోకి ఎంటర్ అయిపోయాడు. అయితే సినిమా మొదటి భాగం మొత్తం పాత్రలను పరిచయం చేస్తూ.. వారు ఎదుర్కొనే పరిస్థితులను చూపించడంతో సరిపోయింది. అసలు ఈ పాత్రలన్నీ ఒక చోటుకి తీసుకువచ్చే కథనంలో దర్శకుడు ఎంత టైట్ స్క్రీన్ ప్లే
రాసుకున్నప్పటికీ.. సాధారణ ప్రేక్షకుడికి తరువాత ఏం జరగబోతుందో.. ఊహకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేకపోయినప్పటికీ తక్కువ బడ్జెట్ లో మంచి ప్రయోగం చేశారనే చెప్పాలి.
కథను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఉన్న రెండు పాటలు కూడా కథలో భాగంగా ఉంటాయి. ఫోటోగ్రఫీ సింపుల్ గా ఉంది. కథ మొత్తం ఒక రాత్రిలో జరిగినా.. సింపుల్ లైటింగ్ తో నీట్ గా ప్రెజంట్ చేశారు. ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు సహజంగా ఉన్నాయి. సందీప్ కిషన్ బాధ్యత లేని ఓ మాస్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. తన లుక్ కూడా చాలా మాసివ్ గా ఉంది. శ్రీ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. తన అభినయంతో ఆకట్టుకున్నాడు. రెజీనా పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంది. మధుసూదన్, చార్లే ఎవరి పాత్రల పరిధుల్లో వారు చక్క్గగా నటించారు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. పాటలు, కామెడీ లాంటివి ఇటువంటి కథల నుండి ఆశించలేం. కాబట్టి కొత్తగా ఓ సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడికి ఈ సినిమా కొంతవరకు అలరిస్తుంది.
రేటింగ్: 2.5/5