HomeTelugu Trending'మజిలీ' రెండోవ పాటపోస్టర్‌లో నాగచైతన్య.. సమంత లుక్ చూశారా?

‘మజిలీ’ రెండోవ పాటపోస్టర్‌లో నాగచైతన్య.. సమంత లుక్ చూశారా?

3 9అక్కినేని యువ దంపతులు నాగచైతన్య.. సమంత జంటగా నటించిన ‘మజిలీ’ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. వన్ బాయ్ వన్ గర్ల్ సింగ్ సూపర్ హిట్టైంది. ఇప్పుడు రెండో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మూవీయూనిట్ రెడీ అయ్యింది.

రేపు సాయంత్రం 4:59 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కాబోతున్నది. దీనికి సంబంధించిన పోస్టర్ ను తాజా విడుదల చేశారు. నాగచైతన్య చాలా స్మార్ట్ గా ఉన్నాడు. అటు సమంత కూడా బరువు తగ్గి స్మార్ట్ గా కనిపించింది. కాలేజీ యూనిఫామ్ లో ఈ జంట అందంగా ఉంది. కాలేజీ రోజుల్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ వచ్చే మాంటేజ్ సాంగ్ లోని సీన్ లా ఉన్న ఈ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆలపించారు. శివ నిర్వాణ సినిమాకు దర్శకత్వం వహించారు. షైన్‌స్క్రీన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. దివ్యాంశ కౌశిక్‌ ఇందులో మరో కథానాయికగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu