మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఫ్యాన్స్ అడిగిన చిలిపి ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు ఇస్తుంటాడు. ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ చాట్‌లోకి వచ్చిన నాగబాబు.. రెండో పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పాడు. ఓ అభిమాని మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా సర్? అని ప్రశ్నించగా, ‘ఈ వయసులో నాకు పెళ్లా..? అయినా మీరంతా ఓకే అంటే నాకూ ఓకే’ అంటూ నాగబాబు ఫన్నీగా స్పందించాడు. నాగబాబు సమాధానంపై కొంతమంది ట్రోల్ చేయగా, మరికొంత మంది తనలోని హాస్యచతురతను మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రెండో పెళ్లి విషయంపై నాగబాబు మాట్లాడాడు. ఇటీవల జరిపిన ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ చాట్‌లో ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్’ అని అడగ్గా.. ‘మా ఆవిడ ఒప్పుకోలేదు. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా వార్నింగ్ ఇచ్చింది.. అంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను’ అంటూ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. దీంతో మరోసారి నాగబాబు ఫన్నీ రిప్లై సోషల్ మీడిమాలో వైరల్ అయింది.