HomeTelugu Trendingమొదట్లో ఊపిరాడక ఇబ్బందిపడ్డా: నాగబాబు

మొదట్లో ఊపిరాడక ఇబ్బందిపడ్డా: నాగబాబు

Nagababu shared his coron

మెగా బ్రదర్‌ నాగబాబు కోరనా బారిన పడి కొలుకున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో తాను ఏవిధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాననే విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించినా సరే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘కరోనాని జయించిన యోధుడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమే. అస్తమా ఉన్న కారణంగా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారుపడ్డా. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరాను. మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డాను. మూడో రోజుకి వాసన గుర్తించే లక్షణాన్ని కోల్పోయాను. వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడిన తర్వాత కొన్నిరోజులకు కరోనా లక్షణాలు తగ్గాయి. దీంతో వైద్యులు నన్ను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఇంటికి వచ్చాక మరో వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నాను.’ ‘నేను ఇంటికి వచ్చే సమయానికి నా భార్య పద్మజకి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మేమిద్దరం స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. అది మాకు కఠిన సమయమే అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొగలిగాం. అయితే సాధారణ జీవితంలోకి రావడానికి నాకు కొంచెం ఎక్కువ సమయమే పట్టింది.’

Recent Articles English

Gallery

Recent Articles Telugu