HomeTelugu Big Storiesసన్ ఆఫ్ ఇండియా మీద సెటైర్లు!

సన్ ఆఫ్ ఇండియా మీద సెటైర్లు!

Son of India

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో వేసే పంచులు, సెటైర్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఎక్కువగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టడం, అందులో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తన స్టైల్లో కౌంటర్ వేస్తుంటాడు. ఇందులో భాగంగా కొందరి మీద నేరుగా కౌంటర్లు వేస్తుంటే.. ఇంకొందరి మీద పరోక్షంగా సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా నాగబాబు మరో సారి ఇన్ స్టాగ్రాంలో చిట్ చాట్ చేశాడు. తన అభిమానులకు అదిరిపోయే రిప్లైలు ఇచ్చాడు..

అయితే ఇందులో ఓ వింత ప్రశ్నకి నాగబాబు వెరైటీగా సమాధానం ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ లేదా కేజీయఫ్ అంటూ ఓ అభిమాని ప్రశ్న సంధించాడు.దీనికి నాగబాబు ఈ మధ్యే ఒక లెజెండరీ గ్రాఫిక్ సినిమా అని తన స్టైల్లో రిప్లై ఇచ్చారు . అంటే అది సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించేనని అందరూ అనుకుంటున్నారు.. గతంలో మా ఎన్నికలు ప్రతీ సందర్భంలోనూ నాగబాబు వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగానే సాగింది. ఇక ఇప్పుడు మళ్లీ నాగబాబు ఓ లెజెండరీ గ్రాఫిక్ సినిమా అంటూ తన స్టైల్లో కౌంటర్ తో స్పదించడం పై మంచు ఫ్యామిలీ వర్సెస్ నాగబాబు వ్యవహారం మాత్రం ఇంకా వేడి మీదే ఉందనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu