HomeTelugu Trendingరెండో పెళ్లి నాకు ఓకే: నాగబాబు

రెండో పెళ్లి నాకు ఓకే: నాగబాబు

NagaBabu shaking Reply To h

మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న నాగబాబుకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘సర్‌..మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ఓ నెటిజన్‌ అడగ్గా..ఈ వయసులో నాకు పెళ్లా..మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే’ అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చారు. రెండో పెళ్లిపై నాగబాబు చేసిన ఈ కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్‌ చేస్తూ పలువురు దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. మరోవైపు రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్‌పై కొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు.మీరంతా ఓకే అంటే పెళ్లికి ఓకే ఏంటి బ్రదర్ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం నాగబాబు సమయస్ఫూర్తితో సరదాగా అన్నాడు దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నాగబాబు రెండో పెళ్లి మ్యాటర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu