మూవీ ఆర్టిస్ట్స్ అసోసియన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు111 ఓట్ల మెజార్టీ తో విజయంసాధించారు. ఈ వార్త విన్న నాగబాబును తీవ్ర మనస్తాపానికి గురై “మా ” అసోసియేషన్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోడం నాగబాబు ఎందుకు జీర్ణించుకోలేకపోయాడు ? “మా ” ప్రాధమిక సభ్యత్వానికి కూడా అందుకే రాజీనామా చేశారడు ? మంచు విష్ణును నిన్నటి వరకు “మా ‘అధ్యక్షుడిగా వున్న నరేష్ సపోర్ట్ చేయడమే కాక ప్రత్యర్థులపై పోరాటానికి దిగాడు. మంచు విష్ణు గెలుపు కోసం రాత్రి పగలు శ్రమించాడు. ప్రకాష్ రాజ్ గెలుపు కోసం మెగా బ్రదర్ నాగబాబు ఎంతో శ్రమించాడు.
విష్ణుకు ఉన్న మైనస్ పాయింట్లు , ప్రకాష్ రాజ్ కు వున్న ప్లస్ పాయింట్లను చెబుతూ అతన్ని గెలిపించామని “మా” సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేశాడు . నాగబాబు కూడా గతంలో “మా ” అధ్యక్షుడిగా పనిచేశాడు. మంచు విష్ణు కన్నా ప్రకాష్ రాజ్ సర్వ సమర్థుడని చెప్పినా “మా ” సభ్యులు ప్రాంతీయ తత్త్వం , మన అనే భేద భావం వదిలి పెట్టక పోవడం నాగబాబును మానసికంగా దెబ్బతీసింది. ఇదే సమయంలో విష్ణు గెలుపు తన గెలుపుగా నరేష్ సంబరాలు చేసుకున్నాడు . ప్రకాష్ రాజ్ కోసం మెగాస్టార్ చిరంజీవి మద్దతు పరోక్షంగా ఇచ్చినా ప్రత్యక్షంగా మద్దతు తెలిపి అతని విజయం కోసం శక్తి యుక్తులను ఉపయోగించినవాడు నాగబాబు . అందుకే ప్రకాష్ రాజ్ ఈ ఓటమిని అంగీకరించి విష్ణును కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలిపినా నాగబాబు మాత్రం ఈ ఓటమి తన ఓటమిగా భావించాడు . అందుకే “మా “కు గుడ్ బై చెప్పాడు.
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో
కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో
కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా”
ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను…
సెలవు.
– నాగబాబు, pic.twitter.com/wLqwOKsNtq— Naga Babu Konidela (@NagaBabuOffl) October 10, 2021