మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ వీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోచ్చుకుంటారు నాగబాబు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు.. నిహారిక ఏమి చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఎందుకు డిలీట్ చేసింది అంటూ నెటిజన్స్ ప్రశ్నలు సంధించారు.
ఇక వీటికి కూడా తడబడకుండా నాగబాబు వ్యంగ్యమైన సమాధానాలు చెప్తూ నవ్వించాడు. ‘నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి డిలీట్ చేశా.. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్నిరోజుల క్రితం నిహారిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసిన విషయం తెలిసిందే. యూట్యూబర్ నిఖిల్ తో నిహారిక జిమ్ చేస్తున్న వీడియోపై ట్రోల్స్ రావడంతోనే ఆమె తన అకౌంట్ ని డిలీట్ చేసింది అని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు నాగబాబు కూడా అస్సలు విషయాన్ని పక్కకు నెట్టి ఫన్నీ ఆన్సర్ ఇచ్చి నెటిజన్స్ ని కన్ప్యూజ్ చేశాడు.