జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. తాజాగా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పారు. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జబర్ధస్త్ షో విడిచి ఈ ప్రోగ్రామ్ చేయడంపై ఇప్పటికే పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు. జబర్ధస్త్‌లో తన తోటి జబర్ధస్త్ షో జడ్జ్ రోజా పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ముందుగా మల్లెమాల వాళ్లు ప్రొడ్యూస్ చేస్తోన్న ‘అదుర్స్’ కార్యక్రమం చేస్తున్నాను. ఆ టైమ్‌లో తన పర్సనల్ మేనేజర్.. ఒకరు.. ‘జబర్ధస్త్’ అనే ప్రోగ్రామ్ వస్తోందని కేవలం 25 ఎపిసోడ్లు ప్లాన్ చేశారని దానికి జడ్జ్‌గా ఉండాలని చెప్పారు. అంతేకాదు ఈ ప్రోగ్రామ్‌లో మీకు రాజకీయ విభేదాలున్న రోజాతో కలిసి పనిచేయాలని కూడా చెప్పారు. అది మీకిష్టమేనా అన్నారు. అపుడే ఆలోచించాను. ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తితో ఎందుకు కలిసి పనిచేయాలా? వద్దా? అని ఆలోచించాను. రాజకీయంగా ఎన్ని విభేదాలన్న క్రియేటివ్ ఫీల్డ్‌లో అవన్ని చూపించకూడదని నిర్ణయించుకున్నాను.
అంతేకాదు జబర్దస్త్ కామెడీ షో ప్రోగ్రామ్‌లో రోజాగారితో మంచి అండర్ స్టాండింగ్‌తో కలిసి పనిచేసానన్నారు. మా షో తొలి ఎపిసోడ్‌తోనే సూపర్ హిట్ అయింది. ఈ షో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మల్లెమల వాళ్లకు చెప్పాను. ఈ ప్రోగ్రామ్ అలానే సక్సెస్ అయింది. దాంతో అలా కంటిన్యూ చేశామన్నారు. నేను ఈ ప్రోగ్రామ్‌ను ఆపేసినా.. అది కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు.