HomeTelugu Trendingచిరంజీవి, పవన్ కల్యాణ్‌పై నాగబాబు భావోద్వేగ పోస్ట్

చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై నాగబాబు భావోద్వేగ పోస్ట్

Nagababu emotional post

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఓవైపు సినిమాలు, మరోవైపు జనసేన పార్టీ పనులతోనూ బిజీగా గడుపుతున్నారు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్‌తో ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరైన సందర్భాలు తక్కువనే చెప్పాలి. వీలైన ప్రతిసారీ తన తల్లి, అన్నయ్య, వదిన, ఇతర కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. అందుకు ఉదాహరణకు చిరు పుట్టినరోజు, రాఖీ పండుగలు వేదిక అయ్యాయి. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజుతో పాటు రాఖీ పండుగ కూడా కావడంతో చిరు ఇంట్లో ఈ వేడుకలు మరింత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్, నాగబాబు వరుణ్ తేజ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ చిరు ఇంటికి చేరుకున్నారు. మెగా కుటుంబం, బంధువులు అంతా ఒకేచోట చేరి సందడి చేశారు.

Nagababu 2

ఈ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొనడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. పవన్‌ ఇంట్లోకి రాగానే చిరంజీవి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని తన తమ్ముడిని ముద్దు పెట్టుకున్నారు. వదిన సురేఖను చూడగానే ‘ఏంటండి సురేఖగారు ఎలా ఉన్నారు’ అంటూ ఆటపట్టించారు. నాగబాబు, చిరంజీవి, పవన్‌ కల్యాణ్ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో షేర్‌ చేస్తూ వీరే నా బలం అంటూ నాగబాబు భావోద్వేగంగా ఓ పోస్ట్‌ చేశారు. చాలా కాలం తర్వాత చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. ‘నా ప్రతి మైలులో చిరునవ్వులను రెట్టింపు చేసి, ప్రతి క్షణం నా జీవితంలో మ్యాజిక్‌ను నింపే నా సోదరులు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ నా బలం.. నా జీవితం’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu