టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘నగాదారిలో..’పాటను విడుదల చేశారు. ‘నిప్పు ఉంది, నీరు ఉంది నగాదారిలో..చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో..’అంటూ సాగే ఈ పాటకు ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించగా.. ఫోక్ సింగర్ వరం అద్భుతంగా ఆలపించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.
హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ కథను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్రలు ముఖ్య పాత్రలు పోషించారు. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.