HomeTelugu Trendingశ్రీకృష్ణగా నాగశౌర్య!

శ్రీకృష్ణగా నాగశౌర్య!

Naga Shourya new movie titl

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య వరస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవలే సొంత చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ నేపధ్యంలో అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు. ఇటీవ‌లే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి, లేదా మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్ అనుకుంటున్నారట‌. ఈ మూవీలో హీరో పాత్ర శ్రీకృష్ణుడు, హీరోయిన్ పాత్ర సత్యభామ తరహా పురాణ పాత్రలను గుర్తుకు తెస్తాయట. దాంతో దీనికి ‘శ్రీకృష్ణ-సత్యభామ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కథకు ఇది బాగా సూటవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu