యువ నటుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. అలా ఎలా ఫేమ అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సొంత బ్యానర్‌పై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసేందుకు మంచి టీమ్‌తో సిద్ధమైనట్లు దర్శకుడు అనీష్ కృష్ణ తెలిపారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నట్లు నిర్మాత తెలిపారు. నాగశౌర్య నటిస్తున్న 22వ సినిమా. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.