HomeTelugu Big Storiesసొంత బ్యానర్ లో నాగశౌర్య సినిమా!

సొంత బ్యానర్ లో నాగశౌర్య సినిమా!

యంగ్ హీరో నాగశౌర్య సుకుమార్ నిర్మాణంలో ఓ సినిమా, అలానే సాయి కొర్రపాటి నిర్మాణంలో మరో సినిమా చేయాల్సివుంది. కానీ రెండు సినిమాలు కూడా మొదలవ్వక ముందే కొన్ని కారణాల వలన ఆగిపోయాయి. ఇప్పుడు నాగశౌర్య స్వయంగా సొంత బ్యానర్ ను స్థాపించబోతున్నాడు. ఈ బ్యానర్ కు అధినేతగా శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ వ్యవహరించనున్నారు. మొదటగా శౌర్య హీరోగా ఈ బ్యానర్ లో సినిమా రాబోతుంది.
ఆ తరువాత వీలైనన్ని చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. శౌర్య నటించబోయే సినిమాకు దర్శకుడిగా త్రివిక్రమ్ శిష్యుడు వెంకట్ పని పనిచేయబోతున్నారు. శౌర్య సరసన మంచి క్రేజ్ ఉన్న అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం శౌర్య కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు శౌర్యను ఏ సినిమాలోనూ.. చూడని విధంగా ఈ సినిమాలో ప్రెజంట్ చేయబోతున్నారు. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu