టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన 20వ చిత్రం కోసం పూర్తి స్థాయిలో మేకవర్ ట్రై చేస్తున్నాడు. దీని కోసం గంటల కొద్దీ జిమ్‌కి టైమ్ కేటాయిస్తున్నాడు. శౌర్య హార్డ్ వర్క్ గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమాని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఈ సినిమాలో 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ బాడీతో కనిపించేందుకు చాలానే కష్టపడుతున్నట్లు తాజాగా విడుదలైన చూస్తే అర్ధమౌతుంది. ఇక ఫొటోలో నాగశౌర్య న్యూ లుక్ ఆకట్టుకుంటుంది. పోనీ టైల్.. గుబురు గడ్డంతో ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు.