టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. పవన్ బసమ్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేంగా షూటింగ్ జరుపుకుంటుంది కాగా ఆదివారం నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. శౌర్య గణపతి నిమర్జణ వేడుకలో ఉన్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తుంది. పవన్ సీ.హెచ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Wishing the young and talented @IamNagashaurya a very Happy Birthday 💥
He will light up the screens with his presence in our Production No. 6 🔥@PawanBasamsetti @pawanch19 @sudhakarcheruk5 pic.twitter.com/V1PDdmKuPQ
— SLV Cinemas (@SLVCinemasOffl) January 22, 2023