HomeTelugu TrendingNaga Shaurya Darshan Controversy: రాంగ్ టైమ్ లో రాంగ్ హీరో కి సపోర్ట్

Naga Shaurya Darshan Controversy: రాంగ్ టైమ్ లో రాంగ్ హీరో కి సపోర్ట్

Naga Shaurya
Naga Shaurya makes a mistake by supporting Darshan

Naga Shaurya Darshan Controversy: కన్నడ నటుడు దర్శన్ వివాదం గురించి తెలియని వారు ఉండరు. కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గానే మారింది. సొంత అభిమాని రేణుక స్వామిని కర్కసంగా హత్య చేసిన దర్శన్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. కేవలం తప్పుడు కామెంట్లు చేశాడు అన్న కోపంతో దర్శన్ రేణుక స్వామిని అతి దారుణంగా హత్య చేశారు.

త్వరలో దర్శన్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది అభిమానులు కూడా మరణశిక్ష విధించాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒకవైపు కన్నడ నటీనటులు కూడా ఈ విషయం గురించి స్పందించడానికి జంకుతున్నారు. ఇలాంటి సమయంలో తెలుగు నటుడు నాగశౌర్య వచ్చి ఏకంగా హత్య చేసిన దర్శన్ కు వత్తాసు పలికారు.

దర్శన్ అన్న అసలు అలాంటి వ్యక్తి కాదని చాలా దయకల మనిషి అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. అటు రాజకీయాలకు సంబంధించి ఇటు సినిమా వ్యక్తులకి సంబంధించి ఎప్పుడు సపోర్టుగా మాట్లాడని నాగశౌర్య సడన్ గా హత్య చేసిన ఒక కన్నడ నటుడికి సపోర్ట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చాలా పెద్ద పెద్ద వార్తల విషయాల్లో కూడా నాగశౌర్య మౌనమే వహించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు, సినిమాలు లేక సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడినప్పుడు, ఆఖరికి ప్రభాస్ కల్కి సినిమా గురించి కూడా ఒక్క కామెంట్ చేయని నాగశౌర్య ఇప్పుడు సడన్ గా ఒక క్రిమినల్ కి సపోర్ట్ గా మాట్లాడటం అభిమానులను కూడా ఆగ్రహానికి గురిచేస్తుంది.

గట్టిగా మాట్లాడితే నాగశౌర్య కెరియర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా కూడా లేదు. పైగా ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అతి దారుణంగా డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు. ఒకవైపు పడిపోతున్న తన మార్కెట్ గురించి పట్టించుకోకుండా ఇలాంటి పనికిమాలిన వివాదాల్లో కావాలని తల దూర్చి మరి నాగశౌర్య తిట్లు తింటున్నారు.

ఎంత దర్శన్ తనకి అభిమాన హీరో అయినప్పటికీ ఈ వివాదం బయటకు వచ్చిన ఒకటి రెండు రోజుల్లో మాట్లాడితే పరవాలేదు అనుకోవచ్చు. కానీ దాదాపు దర్శనే హత్య చేశాడు అని రుజువు కాబోతున్న సమయంలో వచ్చి ఇలాంటి కామెంట్లు చేయడం ఏమాత్రం బాగాలేదు అని అభిమానులు చెబుతున్నారు.

Naga Shaurya Darshan Controversy:

Naga Shaurya Instagram:

ఆఖరికి వ్యక్తిగతంగా వెళ్లి కలిసి తన మద్దతు ఇచ్చినా పర్వాలేదు కానీ సోషల్ మీడియాలో హత్య కేసులో ఇరుక్కున్న ఒక హీరో గురించి పెద్దపెద్ద పేరాగ్రాఫ్ లు రాయడం నాగ శౌర్య చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది తెలుగు అభిమానులు కూడా నాగశౌర్య సినిమాలను బాయ్ కాట్ చేయాలని ట్విటర్లో కామెంట్లు పెడుతున్నారు. మరి రాంగ్ టైంలో రాంగ్ హీరోకి సపోర్ట్ చేసిన నాగశౌర్య కెరియర్ ఎలా మారుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu