అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని గుడిమెట్లను మోకాలిపై ఎక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సింహాచలం ఆలయం మెట్లను మోకాలిపై ఎక్కుతున్న వీడియోను సాగర్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. ‘నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ 1000 మెట్లు మోకాలితో ఎక్కాను. ఈ అందమైన కార్యక్రమంలో నాకు తోడుగా ఉన్న బొబ్బిలి అక్కినేని ఫ్యాన్స్‌కు థాంక్స్’ అంటూ చైతు, సామ్, నాగార్జునను ట్యాగ్ చేశారు. దీన్ని చూసిన సామ్ రిప్లై ఇచ్చారు. సాగర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ‘ఇది నమ్మశక్యం కాని నిజం.. మాటలు రావడం లేదు. దయచేసి మీరు మమ్మల్ని కలవండి’ అని సామ్ ట్వీట్ చేశారు.
నవంబరు 23న చైతన్య తన 33వ పుట్టినరోజును జరుపుకొన్నారు. తన భర్త జన్మదిన వేడుకల్ని సామ్ ఘనంగా ఏర్పాటు చేశారు. సోమవారం చైతన్య సింగిల్ ఫొటోను సామ్ షేర్ చేశారు. దీంతోపాటు ఇద్దరు కూర్చుని సేదతీరుతుండగా తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఐ లవ్ యు’ అని దానిపై రాశారు.
@chay_akkineni @Samanthaprabhu2 @iamnagarjuna
In the eve of Chaitanya Babu birthday,I completed 1000 steps with my knees for the wellbeing of Chaitanya Babu. Thanks to all akkineni fans of BOBBILI for their cooperation in this beautiful event. pic.twitter.com/HvbLyISwF4— Sagar Nag1234 (@Nag1234Sagar) November 24, 2019