టాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగచైతన్య గతేడాది విడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ వీరి గురించి ఏదో వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ.. ఉంటాయి. ఇక తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో విడాకుల గురించి చేసిన కామెంట్లు.. చర్చనీయాంశంగా మారాయి. భరణం లాంటిది ఏమీ తీసుకోలేదని కుండ బద్ధలు కొట్టేసిన సామ్ తనను, చైని ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు దాచిపెట్టాల్సిందేనని తెలిపింది.
ఇక హోస్ట్ చైను భర్తగా సంభోదించగా.. వెంటనే అడ్డుపడిన సమంత.. భర్త కాదు.. మాజీ భర్త అని పిలవండి అని చురకలంటించింది. అలా సమంత ఓపెన్ అయిందో లేదో ఇటు నాగచైతన్య కూడా తన జీవితం ఎలా సాగుతుందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘ఒక వ్యక్తిగా నేను చాలా మారాను. గతంలో ఇంత ఓపెన్‌గా ఉండేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతున్నాను. నా కుటుంబం, ఫ్రెండ్స్‌తో అనుబంధం ఇంకా పెరిగినట్లు అనిపిస్తోంది. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు.